అసెంబ్లీ అంటే బాలకృష్ణకు షూటింగ్ లాగా కనిపిస్తోందా? అంటూ ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో బాలయ్య తొడ కొట్టిన విషయంపై రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అరెస్టు పై చర్చకు అడుగుతున్న టీడీపీ.. వాస్తవానికి చర్చ జరగాలని కోరుకోవటం లేదన్నారు. అందుకే సరైన ఫార్మెట్ లో రమ్మని చెబుతున్నా కావాలని గందరగోళం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.