ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ ను కెనడాలో తామే హత్య చేశామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియా వేదికగా తాజాగా ఒక ప్రకటన చేసింది. గ్యాంగ్ స్టర్లు గుర్లాల్ బ్రార్ ,విక్కీమిడ్ ఖేరా హత్యల్లో సుఖ్దూల్ సింగ్ ప్రధాన పాత్ర పోషించినట్లు ఆ గ్యాంగ్ తెలిపింది.శత్రవులు ఎక్కడున్నావదిలి పెట్టమంటూ హెచ్చరికలు జారీ చేసింది. కాగా లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో భాగంగా అహ్మదాబాద్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.