మహిళా బిల్లుకు సీపీఐ మద్దతు ఇస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కానీ మహిళా రిజర్వేషన్లు ఇప్పుడే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మహిళల ఓట్ల కోసం మహిళా బిల్లు పెట్టారని విమర్శించారు. ఇండియా కూటమి పెట్టాక బీజేపీ భయపడుతోందని ఆయన అన్నారు. చందమామ రావే జాబిల్లి రావే అంటూ చిన్నారికి అన్నం తినిపించినట్లు మహిళా బిల్లు పెట్టారని ఎద్దేవా చేశారు.