చెన్నై - తిరునల్వేలి మధ్య మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 24న ప్రధాని మోదీ వందేభారత్‌ను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి ట్రయల్ రన్ గురువారం విజయవంతమైంది. ఈ రైలుకు తొలి విడతగా తిరుచ్చి, దిండుగల్, మదురై, విరుదునగర్ స్టేషన్లలో హాల్ట్ ఇచ్చారు. తమిళనాట చెన్నై-మైసూరు, చెన్నై-కోవై మధ్య ఇప్పటికే వందేభారత్ రైళ్ల సేవలు అందుబాటులో ఉండగా, చెన్నై-నెల్లై మధ్య ఈ రైలు సేవలందిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa