ముఖ్యమంత్రి స్టాలిన్ మంజూరు చేసిన నిధుల సహకారంతో రాష్ట్రంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పరిశోధనలు అధికస్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి తంగం తెన్నరసు పేర్కొన్నారు. కీళడి, పెరునై, వెంబకోట తదితర ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల వల్ల రాష్ట్ర చరిత్ర ఏ మేరకు వెనకబడి పోయిందో తెలుసుకో గలిగామన్నారు. అందువల్లే తవ్వకాల్లో బయల్పడే పురాతన కళాఖండాలు భద్రపరచి భావితరాలకు వాటి చరిత్ర తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. తంజావూరు ప్రాంతాన్ని పరిపాలించిన చోళ రాజుల ఘనత తెలియజేసేలా భారీస్థాయిలో ఓ ప్రదర్శనశాల ఏర్పాటుకు అవసరమైన స్థలం ఎంపిక చేసి పనులు కూడా ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.