బీజేపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిందని కాంగ్రెస్ ఆరోపించింది. బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో పార్టీ నేతలు మాట్లాడుతూ..... బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 33శాతం రిజర్వేషన్‌ల బిల్లును తక్షణం అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మహిళా రాజకీయ రిజర్వేషన్ పరికల్పన కాంగ్రెస్‌దేనని పేర్కొన్నవారు అప్పట్లో ఈ బిల్లును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎంపీగా ఉన్న వేళ తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. అప్పుడు పనికిరాని బిల్లు బీజేపీకి ఇప్పుడు అత్యంత ప్రియంగా ఎందుకు మారిందో అంటూ ఎద్దేవా చేశారు. ‘ఇండియా’ కూటమికి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణనుచూసి బీజేపీ భయపడుతోందన్నారు.