ఏపీ అసెంబ్లీలో రెండో రోజు కూడా వాడీవేడిగా జరిగింది. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. ఈ క్రమంలో స్పీకర్ మరో ఐదుగుర్ని సస్పెండ్ చేశారు. దీంతో టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేతో పాటూ నందమూరి బాలకృష్ణపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బాలకృష్ణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులను మానసిక ఆస్పత్రికి తరలించాలని.. అసెంబ్లీలో ఇలాంటి ప్రవర్తన సరికాదన్నారు. కాలేజీలో అమ్మాయిలను చూసి విజిల్స్ వేస్తున్నట్లు టీడీపీ నేతల ప్రవర్తన ఉందని ఎద్దేవా చేశారు. బాలకృష్ణకు మెంటల్.. సభకు రానివ్వొద్దు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీట్లో ఇవాళ బాలకృష్ణ కూర్చున్నారని.. ఇవాళ పైనుంచి ఎన్టీఆర్ అసెంబ్లీని చూసి సంతోషపడి ఉంటారన్నారు. మెంటల్ సమస్య ఉన్న బాలకృష్ణను సభలోకి రానివ్వొద్దు అంటూ విరుచుకుపడ్డారు. అందర్నీ గన్తో కాల్చినా కేసులుండని.. టీడీపీ వాళ్లందర్నీ సస్పెండ్ చేసి మెంటల్ ఆస్పత్రికి పంపాలన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు మండిపడ్డారు.