శుక్రవారం జరిగిన పార్లమెంటు సమావేశాల్లో బీఎస్పీ ఎంపీ దనిష్ అలిపై బీజేపీ ఎంపీ రమేష్ బిధురి చేసిన వ్యాఖ్యలపై జేడీయూ నేత రాజివ్ రంజన్ ఘాటుగా స్పందించారు. రమేష్ ప్రవర్తన సిగ్గుచేటన్నారు. ‘‘జరిగిందంతా కెమెరా ముందే ఉంది. ఇక రమేష్ సస్పెన్షన్ విషయంలో బీజేపీ నిర్ణయం తీసుకోవాలి. ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని తక్షణమే తొలగించాలి. పార్టీ సభ్యత్వాన్నీ రద్దు చేయాలి’’అని డిమాండ్ చేశారు.