ఏపీలో నిన్నామొన్నటి వరకూ నారా లోకేష్ పాదయాత్ర చేస్తూంటే.. చంద్రబాబు జిల్లాలు తిరిగేవారు. కానీ చంద్రబాబు అరెస్టుతో టీడీపీ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ‘పల్లెకు పోదాం’ అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీని కేసుల ఉచ్చులో చిక్కేలా చేసి.. తాము రాష్ట్రాన్ని చుట్టేయాలనుకుంటున్నారని.. ఈ దెబ్బతో టీడీపీ డీలా పడిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.