కేరళ రాష్ట్రం కొచ్చిన్‌లోని సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం మెరైన్ బయాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్ బిజోయ్ నందన్, పరిశోధక విద్యార్థి కె విష్ణుదథన్ ఇటీవల తమిళనాడు, రామేశ్వరం సమీపంలోని మండపం సముద్రంలో కొత్తరకం మెరైన్ టార్డిగ్రేడ్ మైక్రోబయోమ్‌ను కనుగొన్నారు. అబ్దుల్ కలాం స్వస్థలమైన రామేశ్వరం సమీపంలో ఈ జీవి కనిపించడంతో దీనికి ‘బాటిలిప్స్ కలామీ’ అని పేరు పెట్టామని, ఈ ఆవిష్కరణ ‘ఇంటర్నేషనల్ సైంటిఫిక్ జర్నల్ ఆఫ్ జువాలజీ’లో ప్రచురితమైందని ప్రొఫెసర్ బిజోయ్‌నందన్ తెలిపారు. ‘టార్డిగ్రేడ్’ అనే జల సూక్ష్మజీవులను కంటితో చూడలేము. వాటిని మైక్రోస్కోప్ సాయంతో మాత్రమే చూడగలం.