రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులను ఇక నుంచి యార్డు అసిస్టెంట్లుగా పరిగణించాలని ప్రభుత్వం పేర్కొంది. ఔట్సోర్సింగ్ పద్ధతిలో కేటగిరి 3 కింద నియమితులైన సెక్యూరిటీ గార్డుల పేరును యార్డు అసిస్టెంట్‌గా పేర్కొంటూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. మార్కెట్ కమిటీల ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం సంఘం విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.