ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఫోన్ 15 డెలివరీ ఆలస్యం కావడంతో,,,యాపిల్ స్టోరీ సిబ్బందిపై కస్టమర్ల దాడి

national |  Suryaa Desk  | Published : Sat, Sep 23, 2023, 09:05 PM

ఐఫోన్ అంటే చాలా మందికి పిచ్చి ప్రేమ ఉంటుంది. కొత్త సిరీస్ విడుదలైందంటే చాలు.. దాన్ని కొనేందుకు ఎగబడుతూ ఉంటారు. చాలా ఖరీదైన ఫోన్ అయినప్పటికీ ఐఫోన్ కొనేందుకు.. కొత్త సిరీస్‌ల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఐఫోన్ వాడితే మన రేంజ్ పెరుగుతుందని భావించేవారు కూడా ఉంటారు. ఇక మొత్తానికి మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే తాజాగా భారత్‌లో విడుదలైన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల కోసం జనం మొబైల్ స్టోర్ల ముందు భారీగా లైన్లలో పడిగాపులు కాస్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారుతున్నాయి.


అయితే ఇక్కడ మాత్రం యాపిల్ స్టోర్ సిబ్బంది.. ఐఫోన్ 15 ఫోన్ల డెలివరీలను ఆలస్యం చేస్తున్నారని కస్టమర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సిబ్బందిపై దాడికి దిగారు. పిడిగుద్దులు కురిపిస్తూ నానా హంగామా చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. కమలానగర్‌ ప్రాంతంలో ఉన్న యాపిల్‌ స్టోర్‌లో ఈ సంఘటన జరిగింది. ఐఫోన్ 15 ఫోన్ డెలివరీ చేయడానికి కొంత సమయం పడుతుందని.. యాపిల్ స్టోర్‌లోకి ప్రవేశించిన ఇద్దరు కస్టమర్లకు చెప్పారు. దీంతో వారు ఆగ్రహానికి గురై సిబ్బందిపై దాడికి తెగబడ్డారు.


అయితే ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న మిగితా ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్‌గా మారాయి. కస్టమర్లు యాపిల్ స్టోర్ సిబ్బందిపై దాడికి దిగడంతో మిగితా సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. కమలానగర్‌లో ఉన్న యాపిల్ స్టోర్‌కు చేరుకున్నారు. సిబ్బంది ఫిర్యాదుతో ఇద్దరు కస్టమర్లపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం


ఐఫోన్‌ 15 సిరీస్‌లో భాగంగా యాపిల్ మొత్తం 4 మోడల్స్‌‌ను విడుదల చేసింది. ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ పేర్లతో ఈ ఫోన్లను రిలీజ్ చేసింది. ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లతో పోల్చితే ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లకు కొన్ని మార్పులు చేసింది. 48 మెగా పిక్సెల్ కెమెరా, తొలిసారిగా సీ టైప్ ఛార్జింగ్ పోర్టును ఇచ్చింది. అయితే ఈ ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 79,900 కాగా.. గరిష్ఠ ధర రూ. 1,59,900గా ఉన్నట్లు యాపిల్ స్టోర్ వర్గాలు వెల్లడించాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com