ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిందని విమర్శించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం వైయస్ జగన్ సిద్ధాంతమన్నారు. ఆ దిశగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని, రైతు భరోసా పేరుతో అన్నదాతలను వ్యవసాయంలో ప్రోత్సహిస్తున్నారని, కోవిడ్ సంక్షోభంలోనూ మా ప్రభుత్వం రైతులను ఆదుకుందన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.