స్కిల్ కార్పొరేషన్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా దీక్షకు దిగిన మోత్కుపల్లిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు నాయుడు పెద్ద అవినీతి పరుడని, నయవంచకుడని గతంలో విమ్మర్శలు చేసిన మోత్కుపల్లి ఇప్పుడు ఆయనేదో నీతిపరుడన్నట్లు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్‌ని చంపించింది చంద్రబాబు నాయుడేనని మాట్లాడిన మోత్కుపల్లి.. ఇప్పుడు డబ్బు, ప్యాకేజీ కోసం చంద్రబాబుని పొగుడుతున్నాడన్నారు. ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించం అని మోత్కుపల్లిని వారించారాయన. అసలు అవినీతిని కనిపెట్టిందే చంద్రబాబు నాయుడని.. స్కిల్ స్కామ్‌లో కోట్లు కొల్లగొట్టాడని ఈరోజు ఆయన పాపం పండి కటకటాల పాలయ్యాడని అన్నారు.