మహిళా ముఖ్యమంత్రులు ఉన్న రాష్టాల్లోనూ జరగనంత మహిళా సాధికారత ఆంధ్రరాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో జరుగుతోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న చర్యలు గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదని చెప్పారు. శాసనమండలిలో మహిళా సాధికారతపై చర్చలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో ఉండటం కోసం సీఎం వైయస్ జగన్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. మహిళలకు 50 శాతానికి మించి నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లోనూ అవకాశం కల్పించారని చెప్పారు.