అక్రమ సంబంధం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఘటన వెలుగుచూసింది. ఆదివారం అర్ధరాత్రి రామాటాకిస్ వద్ద మేడపై నుంచి కిషోర్ అనే యువకుడిని శివారెడ్డి కిందకి తోసేసాడు. కేజీహెచ్ లో చికిత్స పొందుతూ కిషోర్ మృతి చెందాడు. శివా రెడ్డి భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కిషోర్ నీ అడ్డు తప్పించాలనే శివరెడ్డి ఫోన్ చేసి పిలిచి ఘాతుకానికి పాల్పడి ఉంటాడని తెలుస్తుంది.