సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మంగళవారం ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, BRS పార్టీ నేత కవిత పిటిషన్లు విచారణకు రాలేదు. ఈ రోజు షేడ్యూల్కు సంబంధించి మెన్షన్ లిస్ట్‌లో చంద్రబాబు పిటిషన్ లేదని వెల్లడైంది. కాగా, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ.. ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో SLP దాఖలు చేసిన సంగతి తెలిసిందే.