ఏపీలో నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో ఎమ్మెల్యే కిలారు రోశయ్య మట్లాడుతూ.. గడపడగడపకూ ప్రభుత్వ సేవలను తీసుకెళ్లామని చెప్పారు. కులం, మతం పార్టీ భేదం లేకుండా పారదర్శకంగా ప్రజలకుసంక్షేమ పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఇవాళ శాసనమండలిలో స్కిల్ స్కామ్‌పై చర్చించనున్నారు. దీంతోపాటు విద్యారంగంపైనా చర్చ జరగనుంది.