మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)ను మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ప్రస్తుత కల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఏఎఫ్‌ఎస్‌పీఏను అక్టోబర్ 1 నుంచి ఆరు నెలల పాటు పొడిగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ అధికారిక ప్రకటన వెలువడింది. కాగా ఇంఫాల్ లోయ, అసోం సరిహద్దు ప్రాంతాల్లోని 19 పోలీస్ స్టేషన్లను మాత్రం మినహాయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa