ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం టిడిపి నాయకులు కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం రోజుకు 17 రోజులు పూర్తి చేస్తుందని టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు. మాజీ సీఎం చంద్రబాబు అతి త్వరలో జైలు నుంచి బయటకు వస్తారని అన్నారు.