అర్తం అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు సంచరిస్తున్నట్లు పార్వతీపురం అటవీ శాఖ అధికారి త్రినాధరావు శుక్రవారం తెలిపారు. అర్తం గ్రామ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాయంత్రం 6 గంటల తరవాత ఒంటరి ఏనుగు అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఏనుగు సంచారంపై ఏటువంటి సమాచారం ఉన్నా తక్షణమే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa