ఏపీలో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల జరుగుతున్నాయి. దీంతో పలు రైళ్లు రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని కుదించిన్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. అక్టోబరు 2 నుంచి 8 వరకు గుంటూరు-విశాఖ(17239), మచిలీపట్నం-విశాఖ(17219), రాజమహేంద్రవరం-విశాఖ-రాజమహేంద్రవరం (07466-07467) రైళ్లను రద్దు చేశారు. అక్టోబరు 3 నుంచి 9 వరకు విశాఖ-గుంటూరు (17240), విశాఖ-మచిలీపట్నం (17220) రైళ్లు రద్దయ్యాయి. విశాఖ-విజయవాడ-విశాఖ (22701-22702) ఉదయ్ ఎక్స్‌ప్రెస్ అక్టోబరు 2, 3, 4, 6, 7 తేదీల్లో రద్దు చేశారు.
అక్టోబరు 1 నుంచి 6వ తేదీ వరకు ధన్‌బాద్-అల్పూజా (13351) రైలను నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లించనున్నారు. అక్టోబరు 6 టాటానగర్-ఎస్‌ఎంవి బెంగళూరు(12889).. అక్టోబరు 5 టాటా-యశ్వంత్‌పూర్(18111).. హటియా-ఎస్‌ఎంవి బెంగళూరు(12835) అక్టోబరు 1, 3 తేదీల్లో.. అక్టోబరు 4న జాషిది-తాంబరం(12376) అక్టోబరు 2న హటియా-ఎర్నాకుళం (22837) ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మళ్లింపు మార్గంలో నడవనున్నట్లు చెప్పారు. ఈ మార్గంలో పలు రైళ్లకు ఉన్న తాడేపల్లిగూడెం, ఏలూరు స్టాపేజీలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.