కర్ణాటక బెళగావిలోని గోకక్ తాలూకా, కదబగట్టి హిల్ ప్రాంతంలో కొలువైన శ్రీ చౌడేశ్వరీ దేవి ఆలయంలో వినూత్నంగా పూజలు చేస్తారు. సిగరెట్లు, మద్యాన్ని సమర్పిస్తారు. ఆలయం సమీపంలో చెట్టుకు కొబ్బరికాయలు ముడుపులు కట్టి కోర్కెలు నెరవేరగానే అమ్మవారికి మద్యం, సిగరెట్లు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయంలో హిజ్రాలే పూజారులుగా ఉంటారు. శుక్రవారం జాతర సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి తరలివచ్చారు.