ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే.. ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టు కాగా.. ఇప్పుడు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అరెస్టుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా.. అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు స్కాం కేసులో లోకేష్‌ను ఏ-14గా పేర్కొన్న సీఐడీ అధికారులు.. 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. ఢిల్లీలోని ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి వెళ్లిన మరీ.. లోకేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కాగా.. నోటీసుల్లో అధికారులు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇన్నర్ రింగు రోడ్డు స్కాం కేసు విషయమై అక్టోబర్ 4 న ఉదయం 10 గంటలకు.. విజయవాడలోని సీఐడీ ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. కాగా.. విచారణ సమయంలో పలు కీలక అంశాల గురించిన సమాచారం తమకు అందించాలని నోటీసుల్లో సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
120(B), 409,420, 34,35,36,37, 166, 167, 217 ఐపీసీ, 13(2),13(1)(c)&(D) సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో విచారణ నిమిత్తం నోటీసులు ఇస్తున్నట్టు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. కాగా.. విచారణకు సహకరించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే.. ఈ నోటీసుల్లో ముఖ్యంగా 10 కీలక అంశాలను లోకేష్‌కు సీఐడీ అధికారులు సూచించారు. అవేంటంటే..
1. భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకూడదు
2. ఈ కేసు సంబంధించిన ఎవిడెన్స్‌ను ఏవిధంగానూ ట్యాంపరింగ్ చేయకూడదని స్పష్టం చేశారు.
3. ఈ కేసుతో సంబంధమున్న వ్యక్తులను ప్రలోభపెట్టటం గానీ, బెదిరింపులకు గురి చేయటం గానీ చేయకూడదు.
4. అవసరమైతే కోర్టు ఎదుట కూడా హాజరుకావాల్సి ఉంటుంది
5. ఎప్పుడు అవసరముంటే అప్పుడు విచారణకు హాజరై, అధికారులకు సహకరించాల్సి ఉంటుంది.
6. విచారణ సమయంలో నిజానిజాలను పూర్తి పారదర్శకంగా చెప్పాల్సి ఉంటుంది.
7. విచారణ సమయంలో.. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు సంబంధించిన లావాదేవీలను, భూముల లావాదేవీల విషయంలో బోర్డు మీటింగ్స్‌కు సంబంధించిన మినిట్స్ బుక్‌ను, భూముల కొనుగోళ్లకు సంబంధించిన పేమెంట్స్ వివరాలను.. సమర్పించాల్సి ఉంటుంది.
8. కేసుతో సంబంధం ఉన్న దోషులను అరెస్ట్ చేసేందుకు పూర్తిగా సహకరించాల్సి ఉంటుంది.
9. విచారణ కొనసాగినన్ని రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన ఏ ఆధారాన్ని అయినా ధ్వంసం చేయటానికి వీల్లేదు.
10. విచారణలో భాగంగా.. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇంకేమైన కండీషన్స్ పెట్టినట్టయితే.. వాటిని కూడా అనుసరించాల్సి ఉంటుంది.
ఇవన్నీ ఒకెత్తయితే.. చివర్లో బోల్డ్ లెటర్స్‌తో పేర్కొన్న పాయింట్ మాత్రం మరో ఎత్తు. ఒకవేళ.. నోటీసులకు అణుగుణంగా విచారణకు హాజరుకాని పక్షంలో, సహకరించని సందర్భంలో సీఆర్పీసీ 41A(3) & (4) సెక్షన్ కింద.. అరెస్ట్ తప్పదంటూ సీఐడీ అధికారులు హెచ్చరించారు. దీంతో.. సీఐడీ విచారణకు నారా లోకేష్ తప్పకుండా హాజరుకావాలని.. లేకపోతే మాత్రం అరెస్ట్ చేయటం పక్కా అంటూ వార్నింగ్ ఇచ్చేశారు. కాగా.. విచారణకు లోకేష్ హాజరవుతారా.. హాజరైనా వాళ్లు అడిగిన ఆధారాలన్ని తీసుకెళ్తారా.. అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa