ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు అక్టోబర్ 4వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2017 ఏడాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసును తెలంగాణ ఏసీబీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని మరో పిటిషన్ వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa