ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ మహ్మద్ షానవాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నారు. ఆయనను పట్టిచ్చిన వారికి రూ.3 లక్షల బహుమతిని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన షానవాజ్ ఐఎస్ఐఎస్లో చేరాడు. ఢిల్లీలో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు.