చంద్రబాబుపై అక్రమ కేసులు పెడుతున్నారని తెగ గగ్గోలు పెడుతున్నారు. అక్రమ కేసులు అయితే.. చట్టాలు ఎందుకు వారిని కాపాడటం లేదు.? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... ఆయనలో ఏ తప్పు లేకపోతే, ఏ దోపిడీ చేయకపోతే, ప్రజల సొమ్మును కైంకర్యం చేయకపోతే ఎందుకు కోర్టులు రిలీఫ్ ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. ఈ మాత్రం నిజం చంటిపిల్లలకు కూడా అర్ధమవుతోంది. మీ పార్టీ సభ్యత్వం 2020లో 50 లక్షలు అన్నారు.. 2022లో అది కోటికి చేరిందట. ఈ ఐదు కోట్ల జనాభాలో కోటి మంది టీడీపీ సభ్యులు ఉన్నారని మీరు డప్పు కొట్టుకుంటున్నారు. మీ కోటి మంది కార్యకర్తలు కూడా చంద్రబాబు జనం సొమ్ము దిగమింగేశాడని నమ్మారు కాబట్టే కంచాలు కొట్టలేదు. ఇప్పటికైనా ప్రగల్భాలు పలికే టీడీపీ నేతలు కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి. ప్రజలే కాదు...టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు ప్రజల సొమ్ము నొక్కేశారని భావిస్తున్నారన్నది గుర్తించాలి అని అన్నారు.