ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో డాబాపై పిడుగు .. ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 02, 2023, 07:43 PM

విశాఖలో ఆదివారం వర్షంతో పాటు ఓ పిడుగు పడింది.మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో జీవీవీఎంసీ 61వ వార్డు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో భారీ మెరుపుతో పడిన పిడుగుపాటుకు ఓ సరుగుడు కర్ర ధ్వంసమైంది. అలాగే 30 అడుగుల ఎత్తులో దుమ్ము పైకి లేచింది. అంతకు ముందు వర్షం పడుతున్న సమయంలో వాతావరణాన్ని మొబైల్‌లో వీడియో రికార్డు చేస్తుండగా.. ఓ యువకుడు ఈ దృశ్యాన్ని కూడా తీయడంతో సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.. అదృష్టవశాత్తు ఆ సమయంలో మేడపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పిడుగు నేరుగా డాబాపై దుస్తులు ఆరబెట్టేందుకు ఏర్పాటు చేసుకున్న దుక్క కర్రపై పడింది. పిడుగుపాటుకు పెద్దగా మంటలు రావడంతో పాటు రాగి రంగుతో కూడిన బూడిద ఎగిసిపడింది. ఈ ఘటనతో ఆ ఇంట్లో నివసిస్తున్న వారితో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోత ఉండగా.. ఆ తర్వాత వాతావరణం మారిపోయింది.. వాన కురిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com