ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైకోర్టులో పలువురు టీడీపీ నేతలకి ముందస్తు బెయిల్ మంజూరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2023, 02:27 PM

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా బంద్ పాటించారు. ఒంగోలులో బంద్‌లో పాల్గొన్న తెలుగుదేశం నేతలపై పోలీసులు 307 కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసుపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం టీడీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణకు రాగా.. బాధితులు తరుపు న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతో బాధితులపై పోలీసులు కేసు నమోదు చేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్రమ కేసులు నమోదు చేశారని న్యాయస్థానం దృష్టికి లక్ష్మీ నారాయణ తీసుకొచ్చారు. చేతితో కొడితే 307 సెక్షన్ ఎలా వర్తిస్తుందన్న పిటిషనర్ తరుపు న్యాయవాది ప్రశ్నించారు. న్యాయవాది లక్ష్మీనారాయణ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఆరుగురు టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టులో  ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com