సీఎం జగన్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం దసరా తర్వాత జగన్ విశాఖ నుంచి పాలన సాగిస్తారట... దసరాకి జగన్ విశాఖకు రావడం.. శుభ వార్త కాదు, దుర్వార్త అంటూ విరుచుకుపడ్డారు. విశాఖలో ఎటువంటి అరాచక పరిస్థితులు ఉన్నాయో స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారన్నారు. ప్రశాంత విశాఖకు జగన్ వస్తున్నరంటే.. ప్రజల గుండెలు గుభేల్ మంటున్నాయన్నారు. కడప ఫ్యాక్షనిజం విశాఖ వస్తుందని భయపడుతున్నారని తెలిపారు. విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయం పెట్టి ఎవరిని మోసం చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. విశాఖకు జగన్ రావడం ప్రజల ఎవరికీ ఇష్టం లేదని.. కావాలంటే అభిప్రాయాలు సేకరించాలన్నారు.