చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై వచ్చే సోమవారానికి విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. ఏపీ సీఐడీకి కీలక ఆదేశాలిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో సమర్పించిన అన్ని పత్రాలు సోమవారంలోపు సమర్పించాలని ఆదేశించింది. కాగా, ఈ కేసులో 17A అమలు కాలేదని చంద్రబాబు లాయర్లు వాదనలు వినిపించారు. అయితే దీనిపై సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని సీఐడీ కోరడంతో విచారణ వాయిదా పడింది.