ముంబై దాదర్‌లోని శివాజీ పార్క్ ప్రాంతంలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. మహాత్మా గాంధీ స్విమ్మింగ్ పూల్‌లోని మొసలి కనిపించింది. 2 అడుగుల పొడవున్న ఈ మొసలిని బంధించారు. అనంతరం సంబంధిత అధికారులకు దానిని అందించారు. సకాలంలో మొసలిని బంధించడంతో పలువురికి ప్రాణాపాయం తప్పింది. అసలు మొసలి స్విమ్మింగ్ పూల్‌లోకి ఎలా వచ్చిందనే విషయంపై అధికారులు విచారణను ప్రారంభించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.