'పెళ్లి' అనే బంధం కారణంగా ఆడపిల్ల హఠాత్తుగా తల్లిదండ్రులకు, తోడబుట్టిన వారికి దూరంగా వెళ్లిపోవడమే కాకుండా కొత్త వారితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలి. అలా పుట్టింటివారిని వదిలేసి వెళ్లడం ఎంత కష్టంగా ఉంటుందో వధువుకు మాత్రమే తెలుస్తుంది. తర్వాత ఆ కష్టం తెలిసేది ఆ తల్లిదండ్రులకు. ఆ ఇద్దరి దూరాన్ని తగ్గించేందుకు కూతురును మళ్లీ ఇంటికి పిలిపించి 'ఒడిబియ్యం' పోయడం అనే సంప్రదాయం పాటిస్తున్నారు.