సుప్రీంకోర్టులో వాదనలు చూసిన తీరు చూస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు రిలీఫ్ ఖాయం అనిపిస్తుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో తన నివసంలో మీడియాతో మాట్లాడుతూ..‘‘ చంద్రబాబు నాయుడు కేసుపై సుప్రీంకోర్టులో సుధీర్ఘంగా వాదనలు కొనసాగాయి. హరీష్ సాల్వే స్పష్టంగా వాదనలు వినిపించారు. స్కిల్ స్కాం డెవలప్‌మెంట్ కేసులో ఏపీ ప్రభుత్వం దగ్గర ఏ ఆధారాలు లేవు. పుంగనూరు, అంగళ్లు కేసులో బెయిల్ అందరికీ వచ్చింది. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కేసులు పెట్టారు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ నోటీసు ఇచింది. లోకేష్‌ను ఏపీ సీఐడీ రేపు అరెస్ట్ చేస్తామంటే ఎలా..? న్యాయ స్థానాలు ఇంత అన్యాయం జరుగుతుంటే ఖండించాలి. నిన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. బండారు సత్య నారాయణమూర్తి నివాసంపై పోలీసులు దాడి చేసి తలుపులు బద్దలు కొట్టారు. అసెంబ్లీ లో ఒక రూల్ ఇక్కడ మరో రూల్ పెట్టవద్దు. 41a నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయడం ఏంటి...? టైమ్స్ ఆఫ్ ఇండియాలో వైసీపీ పార్టీకి 25 ఎంపీ సీట్లు వస్తాయని సర్వేల్లో తెలింది. ఇది పిట్టల దొర సర్వే అని జనం నవ్వుకుంటున్నారు అని తెలిపారు.