టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై విజయనగరం జిల్లాలో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. చంద్రబాబుకు ఉపకారం చేయడం తప్ప.. అపకారం చేయడం రాదంటూ సామాన్యప్రజలు తమ గొంతుకను వినిపిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసనల ఉద్యమం ఓవైపు హోరెత్తుతుంటే.. మరోవైపు ‘బాబుతో మేము’ అంటూ సంతకాల సేకరణ కార్యక్రమం జోరుగా సాగుతోంది.