ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర కేబినేట్ సమావేశం జరుగుతుంది. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండడంతో ఆ రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మోడీ ఈ రాష్ట్రాల పై వరాల జల్లు కురిపిస్తారని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటిని మంజూరు చేశారు. దానిని ఈ భేటిలో ఆమోదించనున్నారు.