చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా అద్దంకిలో జరుగుతున్న గత 21 రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు, 21వ రోజు దీక్షలో కూర్చున్న బల్లికురవ మండల తెదేపా నేతలు, మోకాళ్ళపై కూర్చుని నల్ల బెలూన్లతో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. అందులో భాగంగా వల్లాపల్లి చింతల రామారావు ఆధ్వర్యంలో మాలపాటి సుబ్బయ్య, ప్రతిపాటి నరసింహారావు, బోంతు దావీదు, బోంతు ఏసుదాసు, మందా సమివేలు, మురికిపూడి మనోహరబాబు పాల్గొన్నారు.