ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో మరో రెండు రోజుల్లో జీతాలు జమ కానున్నాయి. ఇప్పటికే కొంత మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించగా.. మరి కొందరికి ఇంకా చెల్లింపులు జరగలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సమీకరించిన రూ.2000 కోట్ల రుణం.. బుధవారం ప్రభుత్వ ఖజానాకు చేరనుంది. దీంతో రెండ్రోజుల్లో మిగతా ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో.. జీతాలు, పెన్షన్లను ప్రభుత్వం జమ చేయనుంది.