స్కిల్ స్కామ్‌కు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభమైంది. బెయిల్ పిటిషన్‌తో పాటు కస్టడీ, పీటీ వారెంట్ పిటిషన్లపైనా వాదనలు జరగనున్నాయి. చంద్రబాబు తరపున లాయర్ ప్రమోద్‌కుమార్ దుబే వాదనలు వినిపిస్తున్నారు. అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు రాకుండానే విచారణ మొదలైంది.