విజయనగరం జిల్లా, సీతంపేట మండలంలోని సోమగండి గ్రామానికి చెందిన గంట సంతోష్‌కుమార్ 2018లో ఓ ప్రాంతానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికను బలవంతంగా అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందటంతో సీతంపేట పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసారు. నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో మంగళవారం కోర్టు తీర్పు వెలువరించినది . దీనిలో భాగంగానే నిందితుడికి పోక్సో కేసులో 20ఏళ్ల పాటు జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధించారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం 2వ అదనపు జడ్జి కె.శ్రీదేవి తీర్పు వెల్లడించినట్లు సీతంపేట ఎస్‌ఐ నీలకంఠారావు స్థానిక విలేఖర్లకు తెలిపారు. బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా కింద రూ. నాలుగు లక్షలు అందించాలని ఆదేశించారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa