దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి పోస్టర్, ఆహ్వాన పత్రికలను కమిటీ సభ్యులు బుధవారం ఉదయం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ.. దసరా అంటే గుర్తుకు వచ్చేది మైసూరు నగరం అలాంటి మైసూర్ నగరాన్ని తలపించే విధంగా దసరా ఉత్సవాలు ఈ ఏడాది నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజు లలితా పారాయణం, కుంకుమార్చన కార్యక్రమాలు ఉంటాయన్నారు. దసరా అంటే రాష్ట్రంలోనే ప్రసిద్ధ గాంచిన పండగ అని అన్నారు. సిద్ధార్థ కళాశాలలో అమ్మవారి ఉత్సవాలు 15 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. లక్షల మంది భక్తులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుంటారని అన్నారు. అమ్మవారి దీక్షపరులకు వేరుగా, సామాన్య ప్రజలకు అమ్మవారి దర్శనం నేరుగా కలిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అందరికీ అనుకూలంగా ఉండే విధంగా సిద్దార్థ కళాశాలలో నిర్వహిస్తున్నామన్నారు. వేద పండితులు ఘణాపాటి, ఘనపద్యుల నడుమ ఈ కార్యక్రమం జరగనుందన్నారు. 15 నుండి 24 వరకు 15 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతున్నామని వెల్లడించారు. దసరా నవరాత్రుల్లో అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. దసరా నవరాత్రులు దేశంలోని ఎంతో మహత్తరమైన కార్యక్రమమని.. అమ్మవారి పూజ చేయడం వల్ల సకల సంతోషాలు కలగుతాయన్నారు. హస్త నక్షత్రం, శ్రవణా నక్షత్రాల మధ్య పూజలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. నవరాత్రుల్లో అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనం ఇస్తారని గోకరాజు గంగరాజు పేర్కొన్నారు.