తిరుమల తిరుపతి అలిపిరి నడక మార్గం ప్రారంభంలో భక్తులు సేదతీరేందుకు ఉపయుక్తమయ్యేలా కుడివైపు ఉన్న మండపం పునరుద్దరించాల్సి ఉందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అందుకే తొలగించి, అదే విధంగా 20 రాతి పిల్లర్లతో కొత్తది నిర్మిస్తున్నామన్నారు. ఇందుకోసం కోటి 36 లక్షల రూపాయల వరకూ వ్యయం చేయబోతున్నామని తెలిపారు. దీన్ని తొలగించటంపై ఎవరికైనా అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే స్వయంగా పరిశీలించి స్పందించాలని ధర్మారెడ్డి కోరారు. కంచె నిర్మాణంపై వైల్డ్ లైఫ్ అధికారులు రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదన్నారు. అటవీ జంతువుల కదలికలపై ఎప్పటి కప్పుడు నిఘా ఉంచామన్నారు. సీసీ కెమెరాలుతో పాటు ట్రాప్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని ధర్మారెడ్డి వెల్లడించారు.