నెల్లూరు జిల్లాలోని కావలిలో "బాబుతో నేను" పోస్టర్ల రగడ కొనసాగుతోంది. కావలి పట్టణంతో పాటు పల్లెల్లోనూ కావ్య కృష్ణారెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున పోస్టర్లు అతికిస్తున్నారు. బాబుతో నేను పోస్టర్లు అతికిస్తే కేసులు తప్పవంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసుల హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా కావ్య కృష్ణారెడ్డి అనుచరులు తమ పని తాము చేసుకుపోతున్నారు. దీంతో పారిశుధ్య కార్మికులను పోస్టర్లు తొలగించే విధులకు మళ్లించారు అధికారులు. దీంతో కావలిలో ఎప్పుడు ఏం జరగబోతోంది అనే టెన్షన్ నెలకొంది.