నెల్లూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ శాంతియాత్రకి టీడీపీ జిల్లా నేతలు పిలుపునిచ్చారు. శాంతియాత్రలో పాల్గొనేందుకు జనసేన, వామపక్షాల శ్రేణులు సిద్ధమయ్యారు. అయితే శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతివ్వని పరిస్థితి. దీంతో ప్రతిపక్ష పార్టీల నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా శాంతి ర్యాలీ చేపట్టి తీరుతామని టీడీపీ జిల్లా నేతలు స్పష్టం చేశారు.