ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డబ్బులు ఇచ్చి సర్వేలు చేపిస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 04, 2023, 02:00 PM

టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే తన నియోజకవర్గంలో మూడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని, ఇటువంటి పార్లమెంట్‌ స్థానాలు మరెన్నో ఉన్నాయని ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, విజయవాడ, గుంటూరుల్లో వైసీపీ అడ్రస్‌ గల్లంతవుతుందన్నారు. డబ్బులు తీసుకొని సర్వే అంచనాలను వెల్లడించిన వారి అభిప్రాయాన్ని సొంత పేపర్లో ప్రచురించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వ్యక్తిగతంగా తాను కూడా సర్వేలు చేయిస్తున్నానని, చంద్రబాబు అరెస్టు తర్వాత గతంలో పోటాపోటీగా ఉన్న స్థానాల్లో కూడా ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఆత్మసాక్షి సర్వే అంచనా ప్రకారం వైసీపీ 50 స్థానాల్లోనే గెలుస్తుందన్నారు. ఈ సర్వే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తామని ప్రకటించక ముందు చేసినట్టుగా ఆత్మసాక్షి తెలిపిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com