రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైనింగ్‌తోపాటు ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ రూపకల్పనలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో నమోదైన కేసులో ఈ నెల 4న విచారణకు హాజరుకావాలని సీఐడీ తనకు జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని కోరుతూ మాజీమంత్రి నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను విచారించడం తప్పనిసరని దర్యాప్తు అధికారి భావిస్తే.. ఇంటి వద్దనే విచారించేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, మేజర్ సర్జరీలు చేయించుకున్నానని పిటిషన్‌లో పేర్కొన్నారు.