స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ రోజుతో ముగియనున్న చంద్రబాబు రిమాండ్‌ను మరో 15 రోజులు పొడిగించాలని ఏపీ సీఐడీ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. బాబును కస్టడీకి ఇస్తే కేసుకు సంబంధించి లోతైన విచారణ జరుగుతుందని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు.