సరైన సౌకర్యాలు లేక మహారాష్ట్రలోని ఆస్పత్రులలో 3 రోజుల్లో 78 మంది మరణించారు. ఇందులో 30 మంది నవజాత శిశువులున్నారు. బుధవారం నాగపూర్‌లోని రెండు ప్రభుత్వ దవాఖానల్లో 25 మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. నాందేడ్, ఔరంగాబాద్ దవాఖానల్లో రోగుల మరణాలపై బాంబే హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. వివరాల్ని శుక్రవారం లోగా కోర్టుకు సమర్పించాలని ఏక్‌నాథ్ షిండే సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది.