అర్బన్ కోపరేటివ్ బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద ఉన్న రుణ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. వడ్డీ, అసలు ఒకేసారి చెల్లించడాన్ని బుల్లెట్ రీపేమెంట్ అంటారు. ఆర్బీఐ నిర్ణయంతో రుణాలు తీసుకునే వారికీ మేలు చేకూరనుంది.