ఆడపిల్లల భ్రూణ హత్యల నివారణ చర్యల్లో భాగంగా ఒకే ఒక్క ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు ఇచ్చే ప్రోత్సాహకన్ని రూ.35 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్‌వీందర్ ప్రకటించారు. ఒక్క ఆడపిల్ల పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ పాటించే తల్లిదండ్రులకు రూ.2 లక్షలు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇక పిల్లలు వద్దు అనుకున్న వారికి లక్ష రూపాయలు అందిస్తామని తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లో లింగ నిష్పత్తి 1000:950గా ఉంది.